నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం తల్లాహస్సీ నగరంలో శనివారం రాత్రి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఫ్లోరిడా ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో హోమ్‌కమింగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది గాయపడగా, వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు వెల్లడించారు.







కామెంట్‌లు (0)