Magazines

ఫ్లోరిడాలో కాల్పులు.12 మందికి గాయాలు!

25 అక్టోబర్, 2026

florida
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, తల్లాహస్సీ నగరంలో శనివారం రాత్రి ఘోర కాల్పుల ఘటన జరిగింది. ఫ్లోరిడా ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో హోమ్ కమింగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ, కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్