Magazines

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ఎస్సై

2 గంటల క్రితం

SI caught by ACB while taking bribe of Rs. 2 lakh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి ఘటన చోటుచేసుకుంది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్సై శ్రీనివాస్ ఏసీబీకి దొరికారు. ఓ కేసులో ఛార్జ్‌షీట్‌ వేయడానికి రూ.2 లక్షలు ఎస్సై డిమాండ్ చేసినట్లు సమాచారం. అదే మొత్తాన్ని లంచంగా తీసుకుంటుండగా.. నాగారంలోని శిల్పానగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో అనిశా అధికారులు పట్టుకున్నారు. ఇటీవల ఇదే పోలీస్ స్టేషన్‌లో సీఐ, ఎస్సై లంచం తీసుకుంటూ పట్టుబడగా, ఇప్పుడు మరో ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్