నేడు SI ప్రిలిమ్స్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా..!

1 గంట క్రితం

SI Prelims exam today... even a minute's delay could be costly!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో 275 SI పోస్టుల భర్తీకి ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సుమారు 1.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.పరీక్ష కేంద్రంలోకి నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్‌టికెట్, పెన్, గుర్తింపు కార్డు మాత్రమే వెంట తీసుకెళ్లాలని సూచించారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్