నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ నటుడు విజయ్ కుమారుడు సంజయ్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సిగ్మా’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా కనిపించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.






కామెంట్లు (0)