నవతెలం-గాణ హైదరబాద్: నగరంలోని పెద్ద అంబర్‌పేట వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అన్నా చెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా పండగకు స్కూటీపై పెద్ద అంబర్‌పేట్ నుంచి శంషాబాద్ వెళ్తున్న అన్నా చెల్లెళ్ళను వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అన్నాచెల్లెలు మరణించగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెళ్ల మృతి
18 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)