నవతెలంగాణ - హైదరాబాద్ : ఖమ్మంలోని శాంతినగర్ ఏఎస్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్‌లో అచల అజయ్‌కుమార్ (17) అనే విద్యార్థి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎంఎల్‌టీ చదువుతున్న అజయ్‌కుమార్ సాయంత్రం బాత్‌రూమ్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో, తోటి విద్యార్థులు తలుపులు తెరిచి చూడగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్లే తమకు ఆలస్యంగా సమాచారం అందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఖమ్మంలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)