నవతెలంగాణ - హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుకు గత 3 రోజులుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఈనెల 6తో గడువు పూర్తవుతున్నా తర్వాత, నామినేషన్ల చివరిరోజు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో సుదర్శన్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. ఈనెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించనుంది. ఈనెల 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపింది.






కామెంట్‌లు (0)