Magazines

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి: మాజీ మంత్రి హరీష్ రావు

6 గంటల క్రితం

The auction of the Kukatpally truck park lands must be cancelled immediately: Former Minister Harish Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటాలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తేల్చిచెప్పారు.


మూడు నియోజకవర్గాల మధ్య ఉన్న ఏకైక ప్రభుత్వ స్థలం ఇదేనని, దీనిని అమ్మితే లక్షల మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పువని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే భూముల విక్రయాలపై తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఒక్క గజం భూమిని కూడా అమ్మలేదని, ఆ ప్రయత్నమే చేయలేదని స్పష్టం చేశారు.సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్లు.. భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. భూముల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును చూస్తే ఊసరవెల్లి కూడా ఉరి వేసుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్