నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనేది ఉద్యోగానికి మాత్రమే పరిమితమని, సమాజ సేవకు ఎలాంటి విరమణ ఉండదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు సమాజ సేవలోనూ చురుకుగా పాల్గొనే వారికి నిజమైన పదవీ విరమణ ఉండదని పేర్కొన్నారు. జడ్చర్లలో నిర్వహించిన ఎంఈఓ మంజులాదేవి పదవీ విరమణ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. మంజులాదేవి వంటి సేవాభావం కలిగిన వారికి పదవీ విరమణ వర్తించదని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ కేపీఎన్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరై మంజులాదేవిని సన్మానించారు.







కామెంట్లు (0)