Magazines

దసరా పూట విషాదం.. లారీ ఢీకొని మహిళ మృతి

20 అక్టోబర్, 2026

Tragedy during Dussehra.. Woman dies after being hit by lorry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: బండ్లగూడ జాగీర్‌లో దసరా పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. కాళీ మందిర్‌ సమీపంలో అదుపుతప్పిన లారీ బైకును ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. డాన్‌ బాస్కో చర్చిలో జరిగే కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్