నవతెలంగాణ - హైదరాబాద్: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక హైదరాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. కొండాపూర్ బెటాలియన్‌లో పనిచేస్తున్న శ్రీను అనే కానిస్టేబుల్, నాలుగు నెలల క్రితం ఓ యాప్ ద్వారా రూ. 40,000 అప్పు తీసుకున్నారు. చెల్లింపు ఆలస్యం కావడంతో, దీపావళి సెలవుల్లోనూ నిర్వాహకులు ఫోన్లు చేస్తూ వేధించారు. శ్రీను మరియు ఆయన భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపుతామని బెదిరించడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పహాడీ షరీఫ్ పరిధిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో విషాదం: లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ ఆత్మహత్య
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)