Magazines

తీవ్ర విషాదం..కాలువలో గల్లంతై వ్యక్తి మృతి

20 అక్టోబర్, 2026

Tragedy: Man dies after drowning in
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులు.. ఆదివారం తన భార్యకు గాజులు, కమ్మలు కొనిచ్చిన మరుసటిరోజు, వ్యవసాయ బావి సమీపంలోని కేఎల్‌ఐ కాలువ వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదేశాలతో రెండు రోజుల పాటు చేపట్టిన గాలింపు చర్యల అనంతరం, మంగళవారం మృతదేహాన్ని వెలికితీశారు. పండుగ రోజున భర్త కొనిచ్చిన ఆభరణాలను చూసుకుంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్