Magazines

కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

20 నిమిషాల క్రితం

Union Cabinet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్:

కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అసోంలోని కచార్ జిల్లాలో బరాక్ లోయకు గుండెకాయ లాంటి దోలూ వద్ద రూ. 2,014 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు. 12,351 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పీక్ అవర్‌లో 800 మంది ప్రయాణికులకు సేవలందించేలా టెర్మినల్ భవనం, ఏ-320 విమానాలు నడిచేందుకు అనువైన 2,705 మీటర్ల రన్‌వే, 6 విమానాల పార్కింగ్ సామర్థ్యంతో ఆప్రాన్ నిర్మిస్తారు. తేయాకు తోటలు, పర్యాటకం, వాణిజ్యానికి ఇది ఊతమిచ్చి ఈశాన్య భారతాన్ని మరింత అనుసంధానిస్తుంది.


వీటితో పాటు నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల తయారీ పర్యావరణ వ్యవస్థ కోసం రూ. 11,000 కోట్ల పథకానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎనిమిదేళ్ల పాటు అమలయ్యే ఈ పథకం ద్వారా షిప్-టు-షోర్ క్రేన్లు, టన్నెల్ బోరింగ్ మెషీన్లు, హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్లు వంటి అత్యాధునిక పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించడంతో పాటు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 2024-25లో సుమారు రూ. 97,500 కోట్లుగా ఉన్న భారత సీఐఈ పరిశ్రమ 2029-30 నాటికి రూ. 2,28,100 కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే తపాలా శాఖ పరిధిలోని పోస్టల్ ఆపరేషన్స్ పథకానికి రూ. 1,141 కోట్లు, ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ పథకానికి రూ. 1,491 కోట్ల కేటాయింపులకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.


- తమిళనాడులోని కామరాజర్ పోర్ట్‌లో రెండో కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి రూ. 4,288 కోట్లు


- అసోంలోని సిల్చార్‌లోని దోలూ వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధికి రూ. 2,014 కోట్లు


- కామరాజర్ పోర్ట్ లిమిటెడ్‌లో రెండో కంటైనర్ టెర్మినల్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో డీబీఎఫ్‌ఓటీ విధానంలో రూ. 4,288.26 కోట్లు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్