నవతెలంగాణ-హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నెల 27న వేలం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో చేపట్టిన ఈ నిరసనలో మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ట్రక్ పార్క్ స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హరీశ్‌రావు.. వేలాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారని విమర్శించారు. కాప్రా, అమీన్‌పూర్‌లోనూ భూముల అమ్మకానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే భూ అనుమతులను రద్దు చేస్తామని ప్రకటించారు.
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని అడ్డుకుంటాం: హరీశ్ రావు
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)