నవతెలంగాణ-హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులకు ఆర్థిక భార తగ్గించడంతో పాటు సులభతరమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో 600 ధర కలిగిన వీక్లీ బస్ పాస్'ను ప్రారంభించింది. ఈ పాస్ కొనుగోలు చేసిన రోజు నుండి వరుసగా ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ కొత్త వీక్లీ పాస్ ద్వారా ప్రయాణికులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. అయితే, కేవలం పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు మాత్రం ఈ పాస్ వర్తించదని సంస్థ స్పష్టం చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీక్లీ పాస్
25 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)