నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు, ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారని టీఆర్ఎస్ అధినేత్రి కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ జర్నలిస్టులు, ఆదివాసీలపై దాడులు చేయిస్తూ స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎల్ నినో వస్తుందని పది నెలల ముందే సమాచారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు” ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిన్నటి సీఎం ప్రెస్ మీట్లో ఆయన నిస్సహాయత స్పష్టంగా కనిపించిందని, గత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ప్రజా సంక్షేమం కోసం ఆయన చెప్పిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
ఎల్ నినో పై ప్రభుత్వ ముందస్తు చర్యలేవి: టీఆర్ఎస్ అధినేత్రి కవిత
16 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)