Magazines

కాంగ్రెస్‌ హామీలేవీ.. రాహుల్‌ సమాధానం చెప్పాలి: కేటీఆర్‌

38 నిమిషాల క్రితం

Where are the Congress party’s promises? Rahul must provide an answer: KTR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో ‘ఎక్స్‌’ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల అమలుపై రాహుల్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీ డిక్లరేషన్‌లో రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తామని చెప్పి, మూడేళ్లలో రూ.5 వేల కోట్లు కూడా కేటాయించలేదని కేటీఆర్‌ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. మైనార్టీలకు నిధుల కేటాయింపు, రైతుల సమస్యలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్