Sunday, July 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మకూరులో బీఆర్ఎస్ నేతల అరెస్ట్..

ఆత్మకూరులో బీఆర్ఎస్ నేతల అరెస్ట్..

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు :  ఆదివారం కాళేశ్వరం వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న ఆత్మకూరు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడ్డెప్పడ్ జంక్షన్ వద్ద స్వాగతం పలికేందుకు వెళ్తుండగా ఆత్మకూర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ బాషబోయిన పైడి, రేవూరి సంపత్ రెడ్డి, నాయకులు వంగల భగవాన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పాపానీ రవీందర్ ఉన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు స్వాగతం పలికే హక్కును పోలీసులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా వెళ్తున్న తమను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -