Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీఎస్ఎన్ఎల్ బంపరాఫర్..

బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొత్త కస్టమర్ల కోసం కేవలం ఒక్క రూపాయికే ‘ఫ్రీడమ్ ప్లాన్’ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ కింద ఉచిత సిమ్‌ కార్డుతో పాటు, 24 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తాయి.

ఈ ఆఫర్ కేవలం కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుత వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఈ పరిమిత కాల ఆఫర్ 2026 సెప్టెంబర్ 12 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆసక్తి గలవారు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధీకృత రిటైలర్లను సంప్రదించి, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా కనెక్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -