- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన సూర్యాపేట)జిల్లా ముగాల మండలం ఆకు పాముల వద్ద జరిగింది. ప్రమాద సమయంలో బస్సుల్లో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో బస్సులో ఇరుక్కున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



