- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ (మంజల్‌పూర్,ధాంతియ), బీహార్ (బంకిపూర్), గుజరాత్ (వడదోర)లో రాష్ట్రాల్లో జరుగుతున్న బైపోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్లలకు భారీగా తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వడదోర, మంజల్ పూర్ 34.35శాతం, బంకింపూర్ లో 33.57శాతం, ధాంతియలో 68.78 శాతం పోలింగ్ నమోదైంది. వచ్చే నెల ఆగష్టు 4న బైపోల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆయా నియోజక వర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
- Advertisement -



