Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీట్ పేపర్ లీక్‌పై నేడు కొవ్వొత్తుల ప్రదర్శన            

నీట్ పేపర్ లీక్‌పై నేడు కొవ్వొత్తుల ప్రదర్శన            

- Advertisement -

 నవతెలంగాణ-కొండాపూర్
నీట్ (NEET) పేపర్ లీక్ ఘటనపై విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా నేడు సాయంత్రం 6 గంటలకు సంగారెడ్డి గంజ్ మైదానంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు కొండాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు సందగళ్ళ సునీల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరవుతారని,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి సంఘీభావంగా సంగారెడ్డి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -