Thursday, May 21, 2026
E-PAPER
Homeఆటలుకెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా

కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను ఖాతాలో జతచేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బౌలింగ్ రనప్ కోసం వెళ్తూ హార్దిక్ పాండ్యా కోపంగా వికెట్ల బెయిల్స్‌ను చేత్తో గట్టిగా కొట్టి పడగొట్టాడు. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం ‘క్రికెట్ పరికరాలను దుర్వినియోగం చేయడం’ కిందకు వస్తుందని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ విధించిన ఈ శిక్షను హార్దిక్ అంగీకరించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -