- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలో శనివారం ఓ వ్యక్తి అక్రమంగా నిషేధిత గుడుంబాను విక్రయిస్తుండగా మర్రిగూడ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.ఎస్సై బి.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా లోయపల్లి గ్రామానికి చెందిన మాధగొని రాజు తన మోటారు సైకిల్ పై లోయపల్లి నుండి మండల కేంద్రానికి చెందిన రాములమ్మ అనే మహిళ ద్వారా గ్రామంలో నిషేధిత గుడుంబా విక్రయిస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసు వారి ఇరువురిని పట్టుకొని వారి వద్ద ఉన్నటువంటి 4 లీటర్ల గుడుంబాను మరియు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



