Saturday, August 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసర్టిఫికెట్లు విద్యార్థుల సొత్తు : హైకోర్టు

సర్టిఫికెట్లు విద్యార్థుల సొత్తు : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లు వారి వ్యక్తిగత ఆస్తి అని, ఫీజు బకాయిలు ఉన్నాయనే కారణంతో వాటిని కాలేజీలు తమ వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజు రీయం బర్స్‌మెంట్‌ బకాయిలు ప్రభుత్వం నుంచి అందలేదన్న కారణంతో విద్యార్థుల ధ్రువీ కరణ పత్రాలను నిలుపుదల చేసే అధి కారం విద్యాసంస్థలకు లేదని తేల్చింది. బకాయిలు ఉంటే చట్టబద్ధ మార్గాల్లోనే వసూలు చేసుకోవాలని, సర్టిఫికెట్లను కాలే జీల వద్ద ఉంచుకోవడం సరైన విధానం కాదని పేర్కొంది. హనుమకొండకు చెందిన చరణ్‌తేజ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి, బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత కూడా రూ.3.09 లక్షలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మల్లా రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల చెప్పడం చట్టవిరుద్ధమని తేల్చారు. తీర్పు ప్రతి అంది న వారం రోజుల్లోగా పిటిషనర్‌కు చెందిన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తిరిగి అప్పగిం చాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించారు.

​కస్టడీ ఆరోపణలపై విచారణకు ఆదేశం
మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారన్న ఆరోపణలపై సమగ్రంగా, పారదర్శకంగా విచారణ నిర్వహించాలని నగర పోలీసు కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. నిర్బంధ సమయంలోని సీసీటీవీ ఫుటేజీతో పాటు బాధితుడికి సంబంధించిన వైద్య నివేదికలను పరిశీలిం చి ఆయన సమర్పించిన వినతి పత్రంపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తనను పోలీసులు కారణం లేకుండా అదుపులోకి తీసుకుని 24 గంట లకు పైగా నిర్బంధించి వేధించారని పి.శ్రీకాంత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. సంబం ధిత పోలీసు అధికా రులపై చర్యలు తీసు కోవాలంటూ డీజీపీ, పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆధారాలన్నింటినీ పరిశీలించి ఫిర్యాదును పరిష్కరించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను ముగించారు.

​సీఎస్ ఇతర అధికారులకు 
ధిక్కరణ నోటీసులు
మీడియా అక్రిడియేషన్ కార్డుల గడువు పొడిగింపు వ్యవహారంలో కోర్టుకు ఇచ్చిన హామీ అమలు కాలేదన్న ఆరో పణలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమా చార శాఖ అధికారులు, మీడియా అకా డమీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రిడియేషన్ కార్డుల గడువును జూన్‌ 16 వరకు పొడిగిస్తామని ప్రభుత్వం కోర్టులో హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయక పోవడంతో తెలంగాణ ఉర్దూ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబరు 16కు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -