Tuesday, July 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందక్షిణ పసిఫిక్‌లో బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిన చైనా

దక్షిణ పసిఫిక్‌లో బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిన చైనా

- Advertisement -

బీజింగ్‌ : పసిఫిక్‌ మహాసముద్రంలో నిర్దేశిత జలాలలో ఉన్న అణు జలాంతర్గామి నుంచి చైనా ఓ క్షిపణిని పరీక్షించింది. దక్షిణ పసిఫిక్‌లో సోమవారం మధ్యాహ్నం 12.01 గంటలకు చైనా నౌకాదళం అణుశక్తితో నడిచే జలాంతర్గామి నుంచి దూర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని సిన్హువా వార్తా సంస్థ తెలియ జేసింది. అయితే ఈ పరీక్ష వార్షిక సైనిక శిక్షణలో భాగంగానే జరిగిందని, అంతే తప్ప ఏ నిర్దిష్ట లక్ష్యాన్నీ ఉద్దేశించి చేసింది కాదని వివరించింది. పసిఫిక్‌ మహాసముద్రంలో క్షిపణి పరీక్ష నిర్వహించే ప్రణాళిక గురించి చైనా తనకు ముందుగానే సమాచారం ఇచ్చిందని ఆస్ట్రేలియా చెప్పింది. కాగా చైనా క్షిపణి పరీక్షపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌ విమర్శలు కురిపించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -