Tuesday, August 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతుల హృదయాల్లో చిరంజీవి

రైతుల హృదయాల్లో చిరంజీవి

- Advertisement -

సారంపల్లి మరణం పట్ల సీఎం దిగ్భ్రాంతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

సారంపల్లి మల్లారెడ్డి రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప యోధుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రైతుల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని కొనియాడారు. సారంపల్లి మరణం పట్ల సీఎం తీవ్ర సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయరంగ సమస్యల పరిష్కారం కోసం ఆయన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారని గుర్తు చేసుకున్నారు. రైతు సంఘం నేతగా, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర రైతాంగానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. భూమి హక్కులు, సాగునీరు, వ్యవసాయ రుణాలు, విత్తనాలు వంటి అనేక అంశాలపై విస్తృత అధ్యయనం చేసిన ఆయన తన యావత్ జీవితాన్ని రైతాంగ ఉద్యమాలకే అంకితం చేశారని ప్రశంసించారు.

రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంతాపం
సారంపల్లి మల్లారెడ్డి మరణం పట్ల రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు డీజీ నర్సింహారావు, కె.పార్థసారథి, డీఏఎస్వీ ప్రసాద్, ఉమామహేశ్వర్ రావు, సి.రామచంద్రారెడ్డి, కె.వీరయ్య తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

​కష్టజీవుల హక్కుల కోసం పోరాడిన నేత 
సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ సంతాపం
సారంపల్లి మల్లారెడ్డి మరణం పట్ల సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ జిల్లాలో విచ్ఛిన్నమైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని తిరిగి పునర్ నిర్మించడంలో, ఉమ్మడి రాష్ట్రంలో రైతు సంఘాన్ని బలోపేతం చేయడంలో మల్లారెడ్డి కృషి మరువలేనిదని పేర్కొన్నారు.
ఆయన తన జీవితాంతం కష్టజీవుల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. కుటుంబాన్ని కూడా పార్టీ ఆశయాల కోసం నిలబెట్టారని ప్రశంసించారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా మల్లారెడ్డి అందరితో కలిసిపోయేవారని గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మల్లారెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. మల్లారెడ్డి మరణం పట్ల సీపీఐ(ఎం) ఏపీ కమిటీ తరపున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -