కమర్షియల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌

Commercial Comedy entertainerరవి చావలి దర్శకత్వంలో ఎన్‌.రమేష్‌ కుమార్‌ నిర్మించిన చిత్రం ‘బద్మాష్‌ గాళ్ళకి బంపర్‌ ఆఫర్‌’. ‘శాసనసభ’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు పొందిన ఇంద్రసేన, ‘మ్యాడ్‌’ చిత్రంలో నటించిన సంతోష్‌ హీరోలుగా ప్రజ్ఞ నయన్‌, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్‌ ఎస్టేట్‌ దందా చేసే ఒక వ్యక్తి దగ్గర పని చేసే ఇద్దరు కుర్రాళ్ళు అతన్నే ఎందుకు కిడ్నాప్‌ చేశారు. ఆ కిడ్నాప్‌లో వారికి తెలిసిన రహస్యాలు ఏమిటి? చివరకు వాళ్ళు అనుకున్న డబ్బు సంపాదించారా లేదా అనే పాయింట్‌ని పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళ నటి మెర్లిన్‌ ఫిలిప్‌, తమిళ నటుడు తారక్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూర్‌, టెక్సాస్‌, అండమాన్‌లో ఈ నెల 29న రిలీజ్‌ అవుతుంది అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : భోలే షవాలి, కెమెరా: విజరు సి కుమార్‌, ఎడిటర్‌ : మార్తాండ్‌ కె వెంకటేష్‌, మాటలు : ఘటికా చలం, ఫైట్స్‌ : కష్ణంరాజు, డాన్స్‌ : హుస్సేన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శేఖర్‌ అలవకపాటి, లైన్‌ ప్రొడ్యూసర్‌ : తోట శ్రీకాంత్‌.

Spread the love