ప్రజాప్రతినిధి పేరుతో పరువు పోగొట్టుకున్న కౌన్సిలర్..!
వృద్ధురాలిపై అత్యాచార యత్నం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్
బాధితురాలి అరుపులతో పరుగున వచ్చిన స్థానికులు
భయపడి బాత్రూంలో దాక్కున్న నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్:-
ప్రజాప్రతినిధి పేరుతో పరువు పోగొట్టుకున్న కౌన్సిలర్..! స్టేషన్ ఘనపూర్ పురపాలక శాఖ పరిధిలో 9వ వార్డు కౌన్సిలర్ సౌదరపల్లి సంపత్ రాజ్ (38) అనే వ్యక్తి సోమవారం రాత్రి తప్పతాగి ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఇంటిపై నిద్రిస్తున ఓ వృద్ధరాలి(65) పై అఘాయిత్యానికి పాల్పడే యత్నించగా, సదరు వృద్ధ మహిళ ఒక్కసారిగా అరుపులు, పెడబొబ్బలు పెట్టడంతో చుట్టూ ఉన్న ఇరుగుపొరుగు వారు గమంచించగా పక్కనే గల మరో ఇంట్లోని బాతురూం లోకి చొరబడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు 100 కాల్ చేయగా, పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వార్డు కౌన్సిలర్ సౌదరపల్లి సంపత్ రాజ్ ను కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై పిట్టల రాజేష్ తెలిపారు.
వృద్ధురాలిపై కౌన్సిలర్ అసభ్య ప్రవర్తన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



