నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదివారం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కోర్టు అందుబాటులోకి రావడం వల్ల భీంగల్, సిరికొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండలాల ప్రజలకు కేసుల విచారణ వేగవంతమై, సత్వర న్యాయం అందుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే బాధ రేపటితో తీరనుందని స్తానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు నాగేంద్ర, అడ్వకేట్ చైతన్య, శ్రీను, జేజే నర్సయ్యలు విజ్ఞప్తి చేశారు.
రేపు భీంగల్ లో కోర్టు ప్రారంభోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



