నవతెలంగాణ-నవాబు పేట
నవాబుపేట మండల కేంద్రంలోని న్యూ చాణక్య టాలెంట్ హైస్కూల్ లో శనివారం నవాబుపేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వాకిటి నరేందర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలని, ఎలాంటి అనుమానాస్పద మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగం కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అలాగే సైబర్ మోసాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 మరియు మహిళల భద్రత కోసం షీ టీమ్‌లు వంటి పోలీసు సేవలను వినియోగించుకోవాలని విద్యార్థులకు వివరించారు.ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొనగా, సుమారు 150 మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



