నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగల్ గావ్ గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద బాబు పటేల్ ఆధ్వర్యంలో బుధవారం బీటీ రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాని కార్యదర్శి లింగూరమ్ తెలిపారు. జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పనులను పర్యవేక్షించారని తెలిపారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ..బిటి రోడ్డు పక్కన ఉన్న ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను గత కొన్ని నెలలుగా పెరిగిపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. దీనివల్ల ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఎస్సీ కాలనీలో వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపై మురుగునీరు, వర్షపునీరు వచ్చి దాటేందుకు వీలు లేకుండా ఉండేదని, కాలనీ వాసుల సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో జిపి ఆధ్వర్యంలో కల్వర్టు నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు బాబు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
నాగల్ గావ్ లో కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



