Tuesday, August 25, 2026
E-PAPER
Homeఆటలుసీఎస్కే కోచ్‌గా దినేశ్ కార్తిక్ ను నియమించండి: మాథ్యూ హెడెన్

సీఎస్కే కోచ్‌గా దినేశ్ కార్తిక్ ను నియమించండి: మాథ్యూ హెడెన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి హెడ్‌కోచ్‌గా ఎవరు వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ రాజీనామా చేయడంతో, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. ఈ క్రమంలో మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి హెడ్‌కోచ్‌గా ధోనీ వద్దని, భారత క్రికెటర్‌ దినేశ్ కార్తిక్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. దినేశ్ కార్తిక్ ఆ పదవికి సరైనోడని, ఆర్సీబీని రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలపడంలో కీలకమయ్యాడని హెడెన్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -