Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటర్ జాబితా సవరణ ఫారాలు పంపిణీ

ఓటర్ జాబితా సవరణ ఫారాలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఓటర్ జాబితా సవరణపై మండలం రుద్రారం గ్రామంలోని పలు వార్డుల్లో గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో సర్ పత్రాలు పంపిణీ చేసి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కుని,ప్రజాస్వామ్య బలోపేతం చేయడంలో ప్రతి ఓటు ఎంతో విలువైయిందన్నారు. ప్రతి కుటుంబం పూర్తి సహకారం అందించి ఓటర్ జాబితాలో తమ పేరు, చిరునామా వివరాలు సరిచూసుకోని అవసరమైన మార్పులు చేర్పులు, తొలగింపులు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఓ, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -