పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ఈనెల 11వ తేదీన జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడ పాఠశాలలో నిర్వహించే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత తో పాటు, స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మీ సూచించారు. నిర్వాహకులు అధికారులతో కలిసి వారి వారి కార్యాలయాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు మొట్టమొదటిసారిగా జిల్లాలో నిర్వహించడం గర్వ కారణంగా ఉందని ఇదే సందర్భంలో నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
పోటీలు విజయవంతం కావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 33 జిల్లాల నుండి 1500 మంది అథ్లెటిక్స్, 200 మంది టెక్నికల్ అఫీషియల్స్ హాజరుకానున్నట్లు వెల్లడించారు. అండర్ 10, అండర్ 12, అండర్ 14 పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి దత్తారావు, డిటిడిఓ అంబాజీ, ఏసీఎంవో ఉద్ధవ్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్నాక విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గుండం లక్ష్మణ్, యంగ్ ఇండియా నోడల్ ఆఫీసర్ మీనా రెడ్డి, అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, సుభాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.డి. హైమద్, కోచ్లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, రాకేష్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)