నవతెలంగాణ – నాచారం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మల్లాపూర్లో శాంతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానందం హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) అధికారులు, శాంతి యూత్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)