Magazines

సత్తుపల్లి 'రాజీవ్ నగర్‌'లో వీధి నెంబరు బోర్డుల ఏర్పాటు

51 నిమిషాల క్రితం

'Rajiv Nagar'
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్‌లో ప్రజలకు ఇంటి అడ్రస్ సునాయాసంగా తెలుసుకునేందుకు వీలుగా 18 వీధులకు నెంబరు బోర్డులను ఏర్పాటు చేశారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాలతో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ ఆధ్వర్యంలో 7వ వార్డు కౌన్సిలర్ నసీమా షరీఫ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వీధి బోర్డులు ఏర్పాటు కావడంతో చిరునామా సులభంగా దొరుకుతుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా, షరీఫుద్దీన్, ఆంగోతు రామారావు, సారధి, స్వప్న, సూర్య, హమీద్, సురేష్, అబ్దుల్లా పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్