Magazines

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు కలెక్టర్, ఎస్పీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్

2 గంటల క్రితం

Free Coaching
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

ఉచిత స్టడీ మెటీరియల్‌తో పాటు అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందిచే శిక్షణ, ఫిజికల్ ట్రైనింగ్

అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 3 నుంచి 7 వరకు సమీప పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసుకోవాలి

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

నవతెలంగాణ- సంగారెడ్డి

పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్,  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్ కేంద్రాల్లో ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, శిక్షణ తరగతులు అక్టోబర్ 10, 2026 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఈ కోచింగ్‌లో భాగంగా అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందిచే పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలపై శిక్షణ, శారీరక దారుఢ్య పరీక్షలకు సిద్ధమయ్యేలా ఫిజికల్ ట్రైనింగ్ కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు.


అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 7, 2026 వరకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో అభ్యర్థులకు అవసరమైన మార్గదర్శకత్వం, ఉచిత స్టడీ మెటీరియల్, నాణ్యమైన బోధన, ఫిజికల్ ట్రైనింగ్ అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిమచడం జరుగుతుందని, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ పోలీసు ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్