నవతెలంగాణ - తొగుట
పోషకాహారం తీసుకోవడం వల్ల గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఎంతో ప్రయోజనం కలుగు తుందని తుక్కాపూర్ సర్పంచ్ చిక్కుడు కళావతి స్వామి అన్నారు. శనివారం మండలంలోని తుక్కా పూర్ గ్రామంలో పోషణ మాసం కార్యక్రమాన్ని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలిం తలు, చిన్నారులు ప్రతిరోజూ సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. పోషకాహారం ద్వారా తల్లులు, పిల్లల ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషణ మాసం సందర్భంగా గ్రామంలో పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)