నవతెలంగాణ-మిడ్జిల్
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మీర్జా సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజన్లలో వచ్చే మార్పుల వల్ల ప్రబలే వ్యాధుల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి అని సూచించారు. చిన్నపిల్లలకు వేసే రోగనిరోధక టీకాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు. ప్రతి బిడ్డకూ సమయానికి టీకాలు అందేలా చూడాలి చూడాలని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామంలో అన్ని వార్డులు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తిరిగి అపరిశుభ్రతగా ఉన్న వార్డులను గుర్తించి సర్పంచ్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ , చికెన్ గున్యా ,డయేరియా ,వచ్చినట్లయితే ఏ విధంగా నివారించాలి అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆయుబ్ ఖాన్, పల్లె దావకాల డాక్టర్స్ చెన్నమ్మ ,అనూష, శశాంక్, శ్రీనివాసులు ,హెల్త్ అసిస్టెంట్లు దేవయ్య ,సంపత్ కుమార్, జంగయ్య ,ఫార్మసిస్టు శివకుమార్, ల్యాబ్ టెక్నీషియన్ మోహన్, మరియు ఏఎన్ఎంలు శంకరమ్మ, సరస్వతి ,చంద్రకళ, శ్రీదేవి ,పద్మజ, నీలమ్మ ,తిరుపతమ్మ, పారిజాత, జ్యోతి ,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)