Magazines

దశాబ్ది ఉత్సవాల పై  బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

2 గంటల క్రితం

BRS
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్

నూతన గ్రామపంచాయతీలు, మండలాలు, జిల్లాల ఏర్పాటు జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ద ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  

 జిల్లా అధ్యక్షులు  కంచర్ల రామకృష్ణారెడ్డి  అధ్యక్షతన నిర్వహించగా,  మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్  గొంగిడి సునిత మహేందర్ రెడ్డి హాజరై, మాట్లాడారు. బిఆర్ఎస్ పార్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, వివిధ రంగాలలో తెలంగాణ ఉద్యమం కోసం కృషి చేసిన 30 మందికి సన్మానం చేయనున్నట్లు తెలిపారు. 


ఈ సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి  సందీప్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు  తుంగ బాలు, రాష్ట్ర నాయకులు  గాదె నరేందర్ రెడ్డి, కొలుపుల అమరేందర్,  మాజీ జెడ్పిటిసిలు సుబ్బురు బీరు మల్లయ్య, అనురాధ, పట్టణ మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, జనగాం పాండు,  సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్  ప్రెసిడెంట్ జక్కా రాఘవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్