Magazines

బేతుపల్లి చెరువులో పడి యువకుడు ఆత్మహత్య

25 నిమిషాల క్రితం

suicide
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

ట్రాక్టర్ కొనివ్వలేదని మనస్థాపానికి గురైన యువకుడు ఒకరు సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...​భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సీతారాంపురానికి చెందిన కడెం మనోజ్ (20) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.


గత కొంతకాలంగా ట్రాక్టర్ కొనివ్వాలని తండ్రి సురేష్‌ను మనోజ్ కోరుతున్నాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాది కొనిస్తానని తండ్రి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన మనోజ్ ఈ నెల 6వ తేదీ సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో తండ్రి దమ్మపేట పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. దమ్మపేట పోలీసులు మిస్సింగ్ కేసుగా కేసు నమోదు చేశారు. 


సోమవారం ఉదయం సత్తుపల్లి పరిధిలోని రామనగరం శివారు బేతుపల్లి చెరువులో మనోజ్ మృతదేహం లభించింది.

చెరువు సమీప గ్రామానికి చెందిన ఊకే శివ సమాచారంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు.

మనోజ్ జీవితంపై విరక్తితో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి పోలీసులకు తెలిపాడు. మృతిపై ఎవరిపైనా అనుమానాలు లేవని స్పష్టం చేశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సత్తుపల్లి ఎస్‌హెచ్‌ఓ తుమ్మలపల్లి శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్