కుభీర్ పోలీసులను ఆశ్రయించిన పల్సి గ్రామ మున్నూరు కాపు కూలస్తులు..
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పల్సి గ్రామానికి చెందిన శ్రీరాముల రాజేష్ అనే వ్యక్తి సామాజిక మద్యమంలో మున్నూరు కాపు కులాన్ని కించపరిచేల వ్యాఖ్యలు పోస్ట్ చేశారాని ఆరోపిస్తూ ఆ కుల సంఘ సభ్యులు ఆరోపించారు. దింతో సోమవారం మండల కేంద్రమైన కుభీర్ పోలీస్ స్టేషన్ లో మున్నూరు కాపు కులస్తుల మనోభావాలను దెబ్బతీసే విదంగా సామాజిక మధ్యామంలో పోస్టులు పెట్టడన్ని నిరసిస్తూ పల్సి గ్రామానికి చెందిన మున్నూరు కాపు కూలస్తులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు.
ఈ సందర్బంగా సంబంధిత పోస్టులు చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. సంబంధిత వాక్యాలు చిత్రలను పోలిసులకు అందజేసినట్లు తెలిపారు. కులాల గౌరవాన్ని భంగం కల్గించే వాక్యాలు చేసిన వ్యక్తిపై విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవలని, సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో కొట్టె హనుమాన్లు రాజన్న, రాములు మున్నూరు కాపు కులస్తులు తదితరులు ఉన్నారు.






కామెంట్‌లు (0)