నవతెలంగాణ - ముధోల్
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రసాదాల తయారీ స్టోర్ రూమ్ లో నుంచి సరుకుల దారి మళ్లింపు సంఘటనపై స్టోరీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్న ఆలయ ఉద్యోగి రాజేందర్ ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ య్యాయి. ఆలయ ప్రసాదాల తయారీ స్టోర్ నుంచి సరుకులు మాయం కావడంపై ఆరోపణలు రావటంతో ఈ సంఘటనపై ఆలయ అధికారులు విచారణ జరిపారు. విచారణ అనంతరం స్టోర్ ఇన్చార్జికి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు. సదరు ఉద్యోగి వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెన్స్ వేటుకు గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు స్టోర్ ఇన్చార్జ్ పై సస్పెన్షన్ వేటుపడినట్లు తేలు స్తోంది. ఈ విషయం పై బాసర ఆలయ ఈఓ అంజనీ దేవిని నవతెలంగాణ ఫోన్లో ఆదివారం వివరణ కోరగా స్టోర్ ఇన్ చార్జీ నీ సస్పెన్షన్ చేసిన మాట వాస్తవమేనన్నారు.
బాసరలో దేవస్థానం స్టోర్ ఇన్ చార్జీ సస్పెన్షన్...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)