నవతెలంగాణ-బజార్హత్నూర్
మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో నాబార్డు నిధులు రూ.38 లక్షలతో చేపడుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను బజార్హత్నూర్ గ్రామ సర్పంచ్ పార్చా సాయన్న పరిశీలించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో చేపట్టిన ఈ పనులను పరిశీలించి, నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
పాఠశాలలో విద్యార్థినులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడంతో పాటు, అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో అదనపు గదులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల వినిల్, డుబ్బుల చంద్రశేఖర్, గడ్డల గజేందర్, కొంగర్ల కాశీరాం, పోతన్న తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)