Magazines

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత

3 గంటల క్రితం

spiritual activities
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
నవతెలంగాణ - ముధోల్
ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. ముధోల్ మండలంలోని  చించాల గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా గ్రామంలో  బజరంగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన పెద్దమ్మ తల్లిని  గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చించాల గ్రామంలో ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.


గ్రామంలో అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. గ్రామ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికీ తీసుకెళ్లి పరిష్కారాన్నికి కృషి చేస్తానని చెప్పారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే ను , నాయకులను ,నిర్వాహకులు ఘనంగా సన్మానించి,అమ్మవారి ఫోటోను అందజేశారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాపే వార్ కిష్టయ్య, మాజీ పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సర్వేశ్, తరోడ సర్పంచ్ అరిపోద్దిన్, వెంకటాపూర్ సర్పంచ్ శ్రావణి శేఖర్, చించాల మాజీ సర్పంచ్ ఉమా సత్యనారాయణ, ఉప సర్పంచ్ సాయినాథ్ గౌడ్, నాయకులు విట్టల్ కాంబ్లే, వంశీ,  అంజయ్య, చింటు, ముత్తన్న,శివరాం, పెద్ద సాయిలు, సత్యనారాయణ, లక్ష్మీకాంత్,ఈరన్న, తదితరులు, పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్