Magazines

తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీక అలాయ్–బలాయ్

51 నిమిషాల క్రితం

Alai-Balai
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

నవతెలంగాణ-ఆలేరు టౌను

 తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక, ఆలాయి, బాలాయ్ అని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం అన్నోజిగూడ కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అలాయ్–బలాయ్ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కురుమ సంఘం నాయకులు, సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అలాయ్–బలాయ్ వంటి కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత, ఆత్మీయతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్