నవతెలంగాణ-మిడ్జిల్
గిరిజన విద్యార్థులు చదువుతోపాటు తనకు నచ్చిన క్రీడను ఎంచుకొని, క్రీడా రంగాలలో ఇంటర్నేషనల్ స్థాయిలో రాణించాలని, తల్లిదండ్రులకు గ్రామానికి, మండలానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సర్పంచ్ మణి శంకర్ నాయక్ అన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలలో మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండలం లాఖ్యా తాండాకు చెందిన గిరిజన విద్యార్థిని మధు నాయక్ ప్రతిభ చాటి మూడో స్థానంలో దక్కించుకున్నారు.
ఈ అద్భుత విజయంతో స్వగ్రామానికి తిరిగి వచ్చిన విద్యార్థినికి స్థానిక సర్పంచ్ మన్నీ శంకర్ నాయక్ శుక్రవారం రాత్రి
మరియు తాండాకు చెందిన గిరిజన ప్రజలు, యువకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో మధు నాయక్ ను శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతం నుండి జాతీయ స్థాయి పోటీలకు వెళ్లి కాంస్య పతకం సాధించి తాండా పేరును, మండలానికి గుర్తింపు తెచ్చినందుకు వారు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్, విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)