తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు
నవతెలంగాణ-నెల్లికుదురు
అంబేద్కర్ యువజన సంఘం 50 సంవత్సరాల సర్వోత్సవాల సభలను విజయవంతం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు తెలిపాడు. గురువారం మండల కేంద్రంలో సంఘం దండంపల్లి సైదులు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, దళితరత్న కామ సంజీవరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తప్పెట్ల వీరన్న మాట్లాడుతూ... నవంబర్ 14న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో ఘనంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.
సంఘా ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు దళితుల విద్య, ఉద్యోగం సామాజిక ఆర్థిక రాజకీయ హక్కుల కోసం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసంఅనేక పోరాటాలు చేసిందన్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెస్ఎఫ్ నెల్లికుదురు మండల అధ్యక్షుడు కడారి ఐలయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుళ్ల వెంకన్న, మండల కోశాధికారి శివార్ల నాగేష్ బాబు, మండల నాయకులు మంద ఉప్పలయ్య, వివిధ గ్రామాల నాయకులు కడారి శ్రీకాంత్, హెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)